డిఫ్తిరీయా కేసుతో బాలిక మృతి

31 Jul, 2018 11:47 IST|Sakshi

సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో తొలిసారి డిఫ్తీరియా కేసు నమోదవ్వడం కలకలం సృష్టించింది. డిఫ్తిరియా వ్యాధితో శ్రావణి అనే విద్యార్థి మరణించింది. అనంతరపురం జిల్లా కేంద్రంలోని శారదా మన్సిపల్‌ హైస్కూల్లో ఏడో తరగతి చదివే శ్రావణికి డిఫ్తీరియా సోకడంతో బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పుట్టిన వెంటనే టీకా వేయకపోవడం, శారదా మున్సిపల్‌ హైస్కూల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యతోనే తమ శ్రావణి మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

అంటు వ్యాధి కావడం, డీటీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో పాఠశాల విద్యార్థులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ అందజేయకుండా సరఫరా నిలిపివేసిన టీడీపీ ప్రభుత్వ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీసినట్లు తెలుస్తోంది. వ్యాధి ప్రబలకుండా సకాలంలో స్పందించడంలో మున్సిపల్‌, వైద్యశాఖలు విఫలమయ్యాయి.

మరిన్ని వార్తలు