వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్కు బుద్ధిమాంద్యులు

8 Jul, 2015 16:23 IST|Sakshi
వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్కు బుద్ధిమాంద్యులు

అనంతపురం స్పోర్ట్స్: వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్కు ఆర్డీటీ నుంచి 13 మంది బుద్ధిమాంద్యులను పంపుతున్నట్లు ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్నే ఫెర్రర్  తెలిపారు. గత ఆరేళ్లుగా స్పెషల్ ఒలింపిక్స్లో బుద్ధిమాంద్యులు సాధిస్తున్న విజయాలపై 'బంగారు పండిస్తున్న ఆర్డీటీ స్పెషల్ ఒలింపిక్స్' అనే పుస్తకాన్ని అన్నే ఫెర్రర్ మెయిన్ క్యాంపస్‌లో బుధవారం ఆవిష్కరించారు. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్ జరుగుతాయని ఆమె తెలిపారు.

'ప్రతి ఏడాదిలాగే మా సంస్థలో శిక్షణ పొందుతున్న బుద్ధిమాంద్యులకు అవకాశం కల్పిస్తున్నాం. సకలాంగులకు ధీటుగా బుద్ధిమాంద్యులు సాధిస్తున్న విజయాలు అందరికీ స్పూర్తిని నింపుతున్నాయి. వారిని దృష్టిలో ఉంచుకునే పుస్తకాన్ని ఆవిష్కరించాం. పిల్లలతో పాటు ఆరు మంది కోచ్‌లను పంపుతున్నాం. త్వరలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్లోనూ విజయాలు సాధిస్తారు' అని అన్నే ఫెర్రర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ సీబీఆర్ సెక్టార్ డెరైక్టర్ దశరథ్, డిప్యూటీ డెరైక్టర్ చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు