రెండు రోజులు భారీ వర్షాలు!

3 Sep, 2019 17:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విపత్తు నిర్వాహణ శాఖ మంగళవారం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు