గృహహింస: దిశ టీం 24 గంటలు పనిచేస్తుంది

25 Apr, 2020 17:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్‌ కాలంలో గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణకు ఏర్పాటు చేసిన వన్‌స్టాప్‌ సెంటర్లలో దిశ టీం 24 గంటలు పనిచేస్తుందని దిశ చట్టం ప్రత్యేకాధికారి దీపికా పాటిల్‌ తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వన్‌స్టాప్‌ సంటర్ల నుంచే బాధితులకు నిపుణులైన ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ సహాయం అందుతుందన్నారు. 24 గంటలు పోలీసుల సంరక్షణ, వసతి సౌకర్యం అందుబాటులో ఉంచామన్నారు. (గృహహింస: మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వం)

రాష్ట్రంలోని 23 స్వధార్‌ గృహాల్లో బాధిత మహళలకు వసతి, రక్షణ కల్పిస్తామని, ఇందుకోసం ఉమెన్‌ హెల్స్‌లైన్‌ 181 రౌండ్‌ దీ క్తాక్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. లాక్‌డౌన్‌లో పోలీసు స్టేషన్‌లకు వెళ్లలేరని మహిళలను వేధిస్తే చర్యలు తప్పవని దీపికా హెచ్చిరించారు. మహిళా రక్షణ కోసం దిశ సిబ్బంది 24 పనిచేస్తున్నారని, బాధిత మహిళల తక్షణ సహాయం కోసం ప్రతీ జిల్లాలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని దీపికా పాటిల్‌ తెలిపారు. (గృహ హింసా.. ఫోన్‌ చేస్తే రక్షణ)

   జిల్లా పేరు డయల్‌ చేయాల్సిన నెంబరు
శ్రీకాకుళం 9110793708
విశాఖపట్టణం 6281641040
పశ్చిమ గోదావరి 9701811846 
గంటూరు 9963190234 
పొట్టిశ్రీరాములు నెల్లూరు 9848653821 
కర్నూలు 9701052497
అనంతపురం 8008053408
విజయనగరం 8501914624
తూర్పుగోదావరి 9603231497
కృష్ణ 9100079676
ప్రకాశం 9490333797
చిత్తూరు 9959776697
వై.యస్.ఆర్ . కడప 8897723899
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు