ఆరువారాల కుట్ర! 

16 Mar, 2020 10:18 IST|Sakshi

 స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో అవాక్కయిన  అభ్యర్థులు 

కోడ్‌ ప్రభావంతో అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం 

ఎక్కడి పనులు అక్కడే నిలిపేసిన అధికారులు 

తెరవెనుక కుట్రపై  దుమ్మెత్తిపోస్తున్న రాజకీయ పక్షాలు 

అసలు నిజం తెలుసుకుని విస్తుపోతున్న జనం 

ప్రాదేశికాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు పురపోరుకు నామినేషన్‌ వేసినవారు ఉపసంహరణ కోసం అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరో వైపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు అదికారులు సమాయత్తమయ్యారు. ఇంతలో ఆరువారాల పాటు ఎన్నికల వ్యవహారాలు వాయిదా వేస్తున్నట్టు వార్త. అది విన్న అభ్యర్థులంతా అవాక్కయ్యారు. కాసేపు నిశ్చేషు్టలయ్యారు. ఆనక అసలు విషయం తెలుసుకుని ఆగ్రహోదగ్రులయ్యారు. ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వందంగా ఖండించారు. రాగధ్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఓ అధికారి ప్రతిపక్షాల ఓటమిని చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం... తాను అనుకు న్నది ఎలాగైనా చేయించుకోవడంలో సిద్ధహస్తుడైన ఓ నాయకుడి దుర్బుద్ధి వల్ల ఇప్పు డు జిల్లా అభివృద్ధి నిలిచిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో పూర్తిగా నిమగ్నమైన రాజకీయ పారీ్టలకు ఎన్నికల కమిషన్‌ ఆదివారం పెద్ద షాక్‌ ఇచ్చింది. కరోనా వైరస్‌ను సాకుగా చూపించి స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈ వార్త విని అవాక్కయిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కరోనా కాదు కదా దాని ‘బాబు’ కూడా అడుగుపెట్టలేరని, అలాంటి వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉన్నా... ఎన్నికలు వాయిదా పడటం ఏమిటని ఆయా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

కరోనాపై సర్కారు అప్రమత్తం 
కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇరవై హాస్పిటళ్లను అందుకోసం సిద్ధం చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 27 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచాలని గుర్తించారు. 15 మందిని హోమ్‌ ఐసోలేషన్లో ఉంచారు. 12 మందికి 28 రోజుల అబ్జర్వేషన్‌ కూడా పూర్తయి వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తేల్చారు. ఇంత వరకూ విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. నిజానికి ఈ వైరస్‌ సోకిన వంద మందిలో 85 మంది వైద్యం పొంది వైరస్‌ నుంచి విముక్తి పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో కేవలం 3 శాతం మంది మాత్రమే మృత్యువాత పడుతున్నారు. వారిలో కూడా వయసుమీద పడిన వారు, హైపర్‌ టెన్షన్‌ ఉన్నవారే. ఈ వైరస్‌ చిన్నపిల్లల జోలికి పెద్దగా వచ్చింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ వాయిదా వేయడం విమర్శలకు తావిస్తోంది.

సంక్షేమానికి అవరోధం 
ఎన్నికల వాయిదాతో జిల్లాలో సంక్షేమానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజు స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. పేదలందరికీ ఇళ్లు అనే పథకంలో భాగంగా జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని 61,781 కుటుంబాలను జిల్లా అధికారులు వలంటీర్ల సాయంతో గుర్తించారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లో 30,108 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 31,681 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల తర్వాతైనా వస్తాయని పేద ప్రజలు ఆశతో ఉండగా ఎన్నికలు వాయిదా వల్ల కోడ్‌ ఇంకా కొన్నాళ్లు కొనసాగి, స్థలాలు రావడం ఇంకా ఆలస్యం అవుతోంది.

జగనన్న చేదోడు పథకం ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏటా రూ.10 వేలు చొప్పున ఐదేళ్లు ఇవ్వాలనుకున్నారు. కోడ్‌ వల్ల ఈ పథకం ఆగిపోయింది. జగనన్న కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.15వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75వేలు కాపు సామాజిక వర్గంలోని 45 ఏళ్లు నిండిన మహిళలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనికీ బ్రేక్‌ పడింది. కొత్త రేషన్‌ కార్డులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం అందించే రుణాలకు ఇటీవలే ఇంటర్వ్యూలు జరిగాయి. వాటిని మంజూరు చేసేందుకు కోడ్‌ అడ్డంకిగా మారింది. ఉపాధిహామీ కన్వర్జన్సీ నిధులు రూ.350 కోట్లు జిల్లాలో ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకూ కేవలం రూ.50 కోట్లు వరకూ మాత్రమే వినియోగించారు. ఈ నెలాఖరులోగా పనులు మొదలు పెట్టకపోతే మిగిలిన నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. త్వరగా ఎన్నికలు పూర్తయితే ప్రజలకు ఈ పథకాలన్నిటినీ చేరువ చేయాలని, ఉన్న నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ‘కరోనా కుట్ర’ వల్ల అది సాధ్యమయ్యేలా లేదు. 

అధికారుల దిగ్భ్రాంతి 
జిల్లా అధికారులు సైతం ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా షెడ్యూల్‌ నిర్ణయించిన అధికారులతో సమీక్షలను జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ రద్దు చేసుకున్నారు. కరోనా వైరస్‌పై మాత్రం సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నా రు. కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషన్‌ ఎన్నికలను వాయిదా వేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో జిల్లాలో మూడు జెడ్పీటీసీ, 55 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుందని, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో తమ పారీ్టకి ఇదే ప్రజాదరణ రావడాన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు కుట్ర పన్నారని వారు విమర్శిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్‌ ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు.  

ఎన్నికల వాయిదా  ఏకపక్ష నిర్ణయం 
ఎన్నికలు వాయిదా విషయం టీవీల్లో చూసి ఆశ్చర్యపోయా. వెంటనే పంచాయతీరాజ్‌ కమిషనర్, ప్రిన్స్‌పాల్‌ సెక్రటరీ, డీజీపీలతో మాట్లాడితే ఎవరికీ తెలియదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు. చంద్రబాబుకు గురుదక్షిణగా రమే‹Ùకుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ ఉంటే అధికారులతో ఎందుకు సమీక్షించలేదు. రాజకీయపారీ్టలతో ముందుగా ఎందుకు సమావేశం ఏర్పా టు చేయలేదు. ప్రజాస్వామ్య వాదులంతా ఆలోచించాలి. ఎన్నికల వాయిదాపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం.  
– బొత్స సత్యనారాయణ,  రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి 

ఆ నిర్ణయం అప్రజాస్వామ్యం 
ఎన్నికల వాయిదా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రమేయంతోనే జరిగింది. అన్ని రాజకీయ పారీ్టల సమావేశంలో కరోనా వైరస్‌ ఉంది ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ, సీపీఐ కోరాయి. ఎన్నికల కమిషనర్‌ చంద్రబాబు కులానికి చెందిన వారు. ఆయన టైంలో నియమించిన రమే‹Ùకుమార్‌ కావడంతో వారి ఆలోచన ప్రకారం వాయిదా వేశారు. ఎన్నికల వాయిదా అప్రజాస్వామ్యం. రాష్ట్రానికి రావాల్సిన రూ.5వేల కోట్లు రాకుండా చేయాలన్న రాజకీయ దురుద్దేశంతో వాయిదా వేశారు. రాష్ట్రాన్ని బాగు చేసే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదు.  
– బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులు, విజయనగరం  

మరిన్ని వార్తలు