కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం..

28 Jan, 2020 14:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. అనంతరం తీర్మానాన్ని పరిశీలించిన సీఎస్‌.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం హోంశాఖ అధికారులకు పంపారు. దీంతో మండలి రద్దు విషయంలో ప్రభుత్వం మరో ముందడుగేసినట్లయింది. పార్లమెంట్‌ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభ్యులు రోజంతా సుదీర్ఘంగా చర్చించి.. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు