3 రోజులు.. 86.23 లక్షల కుటుంబాలు

19 Apr, 2020 04:23 IST|Sakshi
విజయవాడలో ఇంటి వద్దే రేషన్‌ పంపిణీ చేస్తున్న వలంటీర్లు

ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీ 

అధికారులు, డీలర్లు,వలంటీర్ల కృషి ఫలితం

సాక్షి, అమరావతి: అధికారులు, రేషన్‌ డీలర్లు, గ్రామ, వార్డు వలంటీర్ల కృషితో మూడు రోజుల్లోనే రాష్ట్రంలో 86.23 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత రేషన్‌ సరుకులు అందాయి. శనివారం ఒక్క రోజే 33.26 లక్షల మంది కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. ఇప్పటి వరకు 1.26 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం, 8,524 మెట్రిక్‌ టన్నుల శనగల్ని పేదలకు పంపిణీ చేశారు.

రేషన్‌ కార్డుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం 5  నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పంపిణీ చేశారు. రాష్ట్రంలో 18.67 లక్షల మంది పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకున్నారు. తెల్లరేషన్‌ కార్డులున్న 1,47,24,017 కుటుంబాలకు సరుకులు అందుబాటులో ఉంచినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియోకార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు