జిల్లాలో ‘దండుపాళ్యం’ ముఠా..!

11 Aug, 2013 05:10 IST|Sakshi
 నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్: ఎక్కడో కర్నాటక రాష్ట్రంలోని ఓ కుగ్రామం దండుపాళ్యం. ఆ గ్రామంలో నేరాలు చేసే ముఠా నివాసం ఉంటుంది. వారి ప్రవృత్తి నేరాలు చేయ డం. ఇటీవల ఆ గ్రామం పేరుతో ఓ చిత్రం కూడా వచ్చింది. దీనికి తోడు సీక్వెల్‌గా ‘దండుపాళ్యం పోలీసు’ పేరుతో మరో చిత్రం కూడా విడుదలైంది. ఈ చిత్రాల్లో చూపించే తరహా నేరాలు జిల్లాలో ఇటీవల జరుగుతున్నాయి. ‘దండుపాళ్యం చిత్రం’లో చూపించిన విధంగా జిల్లాలో ఒక బృందం నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఇంత వరకు పట్టుకోలేక పోవడంతో వారి రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ బృందంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నట్లు ఇటీవల జరిగిన తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ ముఠా ముఖ్యంగా శివారు ప్రాంతాలను ఎన్నుకుని చోరీలకు పాల్పడుతోంది.
 
 పగలు  ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలు, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. రాత్రి ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఒంటరిగా కనిపించే మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లుతున్నారు. రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వృద్ధురాలిని పింఛన్ ఇప్పిస్తామని మోసం చేసి ఆమె వద్ద నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించారు. ఈ మోసంలో ఒక మహిళతో పాటు పురుషుడు కూడా ఉన్నాడు. ఈ బృందానికి శివారు, పట్టణ ప్రాంతం అనే బేధం లేకుండా చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. 
 
 జిల్లాలో ఇలాంటి నేరాలు రోజురోజుకు పెరుగులతున్నా  పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారీ దొంగతనాలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న సీసీఎస్, ఆర్‌సీసీఎస్ పోలీసు బృందాలు, మిగతా వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులు దొంగతనాలను, మోసాలను నియంత్రించడంలో ఏ మాత్రం శ్ర ద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. గత రెండు వారాల్లో ఆర్టీసీ బస్టాండ్‌లో దాదా పు ఆరుకు పైగా దొంగతనాలు జరిగాయి. ఇతర మోసాలు జరిగినా ఏ నాడు నిందితులను పట్టుకోవడంపై దృష్టి సారించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.బాధితులు మాత్రం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులతోనే సరిపెట్టుకోవాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఎస్పీ సార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.
 
మరిన్ని వార్తలు