స్పందన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ

6 Aug, 2019 10:37 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు టౌన్‌) : జిల్లావ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారానికి పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా పనిచేయాలని, కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ హెచ్చరికలు జారీచేశారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల పట్ల మర్యాదగా నడచుకోవటంతోపాటు, వారి సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తు విషయంలో తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు.

ఇక భూ సంబంధిత వివాదాలు కోర్టు పరిధిలో ఉంటే వాటిని సివిల్‌ కోర్టుల్లోనే తేల్చుకోవాలని, వాటిని పోలీసులు పరిష్కరించే అవకాశం లేదన్నారు. కోర్టుల్లో దావా ఉంటే ఆయా వ్యక్తులు కోర్టు ఆదేశాల మేరకే నడుచుకోవాలని కోరారు. భారీగా కురుస్తోన్న వర్షాలతో పోలవరం ముంపు గ్రామాలు జలమయం అయ్యాయని, అటువంటి ప్రాం తాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పో లీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

సమస్యల్లో కొన్ని..
⇔ గుర్తుతెలియని వ్యక్తులు తమ మార్కెటింగ్‌ యార్డ్‌నకు సంబంధించిన రశీదులు నకిలీవి వినియోగిస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోరారు
⇔ తణుకు మండలానికి చెందిన ఒక మహిళ తమ మరిది తమను ఇంటినుంచి పంపేయాలనే ఉద్దేశంతో కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు
⇔ భీమవరానికి చెందిన మహిళ తన కోడలు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తన కుమారుడు, తనపై తప్పుడు కేసులు బనాయిస్తూ మానసికంగా వేధింపులకు పాల్పడుతుందని, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు
⇔ కొయ్యలగూడెం మండలానికి చెందిన ఒక వ్యక్తి డైట్‌ కాలేజీలో ప్రవేశం కల్పిస్తానని చెప్పి తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని, చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వలంటీర్ల పోస్టులు టీడీపీ వారికి ఇవ్వకపోయావో..

చిక్కిన చీటింగ్‌ ముఠా 

ఇండస్ట్రియల్‌ హబ్‌గా దొనకొండ

ఒకరి పొరపాటు.. ఇంకొకరికి గ్రహపాటు

అంతా ఊడ్చుకెళ్లిన దొంగలు!

కౌలు కష్టం దక్కనుంది

దారుణం: రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తల మృతి

ఇంటికెళ్లి తాగాల్సిందే..!

అనూహ్య‘స్పందన’

బతుకు లేక.. బతకలేక..!

ఉద్యోగాల విప్లవం

హాస్టల్‌లో అమానుషం ​; బాత్రూంలో మృతదేహం

ఆరో రోజూ...అదే ఆగ్రహం 

కేశవదాసుపురంలో రెండో రోజూ ఉద్రిక్తత

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

సాగుదారు గుండె చప్పుడే ఈ చట్టం..

8న సీఎం పులివెందుల పర్యటన

సేవకు సంసిద్ధం 

ఇంటి నుంచే స్పందన

సచివాలయ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు

ఆ 750 మద్యం దుకాణాలను ప్రారంభించండి

తప్పులు చేసి నీతులు చెబుతారా?

రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్‌

ఆర్టికల్‌ 370 రద్దు భారతావనికి వరం

తగ్గని గోదా'వడి'

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు

‘స్పందన’.. ప్రజాసంద్రం

ఉదారంగా నిధులివ్వండి

వరద బాధితులకు తక్షణ సహాయం

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది