అర్జీదారులకు న్యాయం చేయండి

7 Jan, 2014 00:24 IST|Sakshi

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి జరి గింది. కలెక్టర్‌తో పాటు జేసీ ఉషాకుమారి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్ తదితర అధికారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఆయాశాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పరి ష్కరించిన వెంటనే అర్జీదారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.

జెడ్పీ సీఈవో డి.సుబ్బారావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, డీఎంఅండ్‌హెచ్‌వో జె.సరసిజాక్షి, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, ఆర్‌వీఎం పీవో బి.పద్మావతి, డీపీవో కె.ఆనంద్, డీఎస్‌వో పి.బి.సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, మత్స్యశాఖ డీడీ కల్యాణం, బందరు ఆర్డీవో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
 
 అర్జీలు ఇవే...
 డిసెంబర్ 31న నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని చర్చి ఫాదర్ మోజెస్, ఆయన భార్య సువర్తామ్మపై కత్తులతో దాడిచేసి గాయపరిచిన ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టిషన్ కౌన్సిల్ సభ్యులు కె.డానియల్‌రాజు, కె.కృపావరం అర్జీ ఇచ్చారు.
 
 అవనిగడ్డలోని తంగిరాల వీరరాఘవయ్య పార్కు డంపింగ్ యార్డుగా మారిందని, చెత్త తొలగించి పార్కును వినియోగంలోకి తేవాలని సామాజిక కార్యకర్త ఆది రామ్మోహనరావు అర్జీ సమర్పించారు.
 
 వీరులపాడు మండలం నరసింహారావుపాలెం గ్రామంలోని సర్వే నంబరు 164లో ఉన్న పల్లగుట్టలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుడు పి.కామేశ్వరరావు  ఫిర్యాదుచేశారు.
 
 మచిలీపట్నం మునిసిపాల్టీలోని చెత్తను పట్టణంలోని జాతీయ కళాశాల సమీపంలో వేస్తున్నారని, దీని వల్ల కళాశాల విద్యార్థులు, ఎస్‌ఎన్ గొల్లపాలెం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ ఫిర్యాదుచేశారు. రుద్రవరం సమీపంలో సేకరించిన 50 ఎకరాల్లో కంపోస్ట్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 లక్ష్మీపురం పంచాయతీ, రామానగరంలోని బీసీ బాలుర హాస్టల్‌ను మోపిదేవి ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో విలీనం చేసేందుకు జరుగుతున్న యత్నాలను విరమించాలని టీడీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు అందే జగదీష్ కోరారు. హాస్టల్‌ను విలీనం చేస్తే అందులో వసతి పొందుతున్న ఘంటసాల, చల్లపల్లి మండలాల బీసీ విద్యార్థులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు.
 
 కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో బెల్టుషాపులు, సారా, మత్తు పదార్థాల విక్రయాలను నిషేధించేందుకు 2002 నుంచి పోరాడుతున్న గ్రామస్తులకు ఎక్సైజ్‌శాఖ అధికారులు సహకరించాలని కోరుతూ గ్రామానికి చెందిన తమ్ము ఏడుకొండలు అర్జీ సమర్పించారు.

మరిన్ని వార్తలు