ఆఫీసులో రాజకీయాలు మాట్లాడొద్దు !

14 Mar, 2019 12:47 IST|Sakshi
చిత్తూరు మున్సిపల్‌ కార్యాలయంలో హెచ్చరిక నోటీసులు అతికిస్తున్న సిబ్బంది

సాక్షి, చిత్తూరు అర్బన్‌: చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో కొందరు టీడీపీ మహిళా కార్పొరేటర్ల భర్తలు రాజకీయాల గురించి విస్తృతంగా చర్చిస్తున్నారనే సమాచారం కమిషనర్‌ ఓబులేసుకు తెలిసింది. దీంతో కార్యాలయ సిబ్బంది, అధికారులను పిలిపించిన కమిషనర్‌ ‘ఆఫీస్‌లోపల రాజకీయాల గురించి ఏఒక్కరూ మాట్లాడొద్దు. చర్చలు పెట్టడానికి కూడా వీల్లేదు. రాజకీయ నాయకులు వస్తే వారి నుంచి దూరంగా ఉండండి. ఏదైనా ఉంటే నాతో మాట్లాడమని చెప్పండి’ అంటూ గట్టిగా మందలించారు. అలాగే కార్యాలయంలోని డెప్యూటీ మేయర్‌ చాంబర్‌లో ఆయనలేనప్పుడు కొందరు టీడీపీ కార్యకర్తలు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కూడా గమనించిన కమిషనర్‌ ఆ గదిని లాక్‌ చేయించి తాళాలు డెప్యూటీ మేయర్‌కు అప్పగించారు. బయటకు వెళ్లేటప్పుడు తాళాలు వేసుకుని వెళ్లాలని సూచించారు. ఇక కార్యాలయంలో హెచ్చరిక నోటీసులు అతికించి ఎవరైనా ఆఫీసులో రాజకీయాలు మాట్లాడితే కోడ్‌ ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు