8 కిలోల కణితి తొలగింపు

17 Apr, 2018 08:05 IST|Sakshi

సాక్షి,తణుకు : తణుకులోని సాయిశ్వేత సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి సుమారు 8 కిలోల బరువున్న కణితిని తొలగించారు. తాడేపల్లిగూడెంకు చెందిన మహిళ అనారోగ్యంగా ఉండటంతో వైద్యురాలు డాక్టర్‌ ఉషారాణిని సంప్రదించింది. స్కానింగ్‌ చేసి కడుపులో కణితి ఉందని గుర్తించారు. డాక్టర్‌ ఉషారాణి, సత్యనారాయణలతో పాటు మత్తు వైద్యనిపుణులు నారాయణరావు పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. 15 ఏళ్ల క్రితమే గర్భసంచిని తొలగించే ఆపరేషన్‌ జరిగిందని, అప్పటి నుంచి శరీరం పెరుగుతోందనే ఉద్దేశంతోనే రోగి నిర్లక్ష్యం వహించిందని వైద్యురాలు చెప్పారు.    

మరిన్ని వార్తలు