అభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలి

17 Jul, 2014 03:33 IST|Sakshi
అభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలి
  •  - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • పుంగనూరు:  ఎంతో నమ్మకంతో ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి ఒక్కరూ వారివారి ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పుంగనూరు మున్సిపల్ కార్యాలయం లో చైర్మన్ షమీమ్‌షరీఫ్, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాద వ్, ఎంపీపీ నరసింహులు, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణంతో కలసి ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులంద రూ ప్రతిరోజు తమ తమ ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరి ష్కరించాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే గ్రామాల్లో సిమెంటు రోడ్లు, కాలువల నిర్మాణం, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలన్నారు.

    సమావేశాల్లో ప్రజాప్రతినిధులంతా అధికారులతో కలసి చర్చలు జరపా లని, ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపట్టేందు కు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పట్టింపులకు, భేషజాలకు వెళ్లకుండా ఐకమత్యంతో అభివృద్ధే ఆశయంగా కృషి చేయాలన్నారు. అలాచేస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైతే ఎంపీ, ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తామని తెలిపారు. అప్పటికీ అవసరమైతే భాస్కర్‌రెడ్డి ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతామ ని ఆయన తెలిపారు.

    ప్రజాప్రతినిధులు తమ ప్రాం తాల్లో అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరా రు. అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని ఈ విషయంలో ప్రజాప్రతినిధులు అపోహలకు గురికావద్దని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జెడ్పీటీసీ వెం కటరెడ్డి యాదవ్ తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆవుల అమరేం ద్ర, కౌన్సిలర్లు ఇబ్రహిం, అమ్ము, రెడ్డిశేఖర్, మనోహర్, రేష్మ, మంజుల, కమలమ్మ, జయలక్ష్మితో పాటు నేతలు రెడ్డెప్ప, అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, గంగి రెడ్డి, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు