కరోనా: సీఎం సహాయనిధికి భారీ విరాళాలు

6 May, 2020 19:25 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా మమ్మారిపై  చేస్తోన్న యుద్దంలో చాలా మంది ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నారు. తాము చేయగలిగినంత సాయం చేస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే  కోవిడ్‌-19 నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌  ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీస్‌ మేనేజిమెంట్ అసోసియేషన్ బుధవారం రూ. 2,56,00,000 విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ప్రతినిధులు ఆలూరు సాంబశివారెడ్డి, ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, మిట్టపల్లి కోటేశ్వరరావు, దాడి రత్నాకర్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు అందించారు. 

(రోనా : సీఎం హాయనిధికి విరాళాలు)

దీనికి తోడు నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ నాయకులు, అభిమానులు కోటి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ( రూ. 1,00,29,000) విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును,డీడీని ఎమ్మెల్యే జి. శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అందించారు. సివీఎస్‌ కృష్ణమూర్తి చారిటీస్‌ ఇరవై ఐదు లక్షలు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించింది. వీరితో పాటు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, నియోజకవర్గ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, డాక్టర్లు, నాయకులు రూ. 89,86,222 విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌కు అందజేశారు. (సీఎం సహాయ నిధికి వాణిజ్య సంఘాల విరాళాలు)

మరిన్ని వార్తలు