ఈ పాలకు మస్తు గిరాకి.. 

11 Aug, 2019 12:50 IST|Sakshi

సాక్షి, కదిరి(అనంతపురం) : ‘గంగిగోవు పాలు గరిటేడైన చాలు.. ఖరము పాలు కడవడైననేమీ’ అంటూ వేమన చెప్పిన మాటలు ప్రస్తుత రోజుల్లో తిరగబడ్డాయి. గంగి గోవు పాలు సంగతి ఎలా ఉన్నా.. ఖరము (గాడిద)పాలు ఉగ్గేడుంటే చాలు అంటూ పెద్దలు ఎంపర్లాడుతున్నారు. నవజాత శిశువులకు గాడిద పాలు తాపడం ద్వారా ఎలాంటి వ్యాధులు దరిచేరవని, జీర్ణశక్తి మెరుగు పడుతుందని పలువురు విశ్వసిస్తుండడమే ఇందుకు కారణం.  ఈ నేపథ్యంలో గాడిద పాలు అమ్మేవారు పది రోజులుగా కదిరి శివారులో మకాం వేశారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన పది కుటుంబాలు దాదాపు 30కి పైగా గాడిదలను వెంట తెచ్చుకుని ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ఉదయాన్నే గాడిదలను తీసుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పాలను అమ్ముతుంటారు. అయితే ఉగ్గు (దాదాపు 5 ఎంఎల్‌) గాడిద పాలను రూ.200 చొప్పున విక్రయిస్తుండడం గమనార్హం.  
 

మరిన్ని వార్తలు