ఆ దుష్ప్రచారం నమ్మొద్దు: కర్నూలు జిల్లా కలెక్టర్‌

19 Aug, 2017 20:12 IST|Sakshi
ఆ దుష్ప్రచారం నమ్మొద్దు: కర్నూలు జిల్లా కలెక్టర్‌

నంద్యాల: వీవీపీఏటీ ద్వారా ఓటు ఎవరికి వేశారో కేవలం ఓటరుకు మాత్రమే తెలుసుందని, పుకార్లు నమ్మవద్దని కర్నూలు  కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.  ఓటు వేయగానే రశీదు వచ్చే సదుపాయం (ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ - వీవీపీఏటీ) ద్వారా ఓటర్లు ఎవరికి ఓటు వేశారో తమకు తెలుస్తుందని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఆయన కోరారు. ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓటు వేయాలని, ఓటు ఎవరికి వేశారో పూర్తిగా రహస్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు.

కాగా నంద్యాల ఉప ఎన్నికపై వైఎస్‌ఆర్‌ జనరల్‌ సెక్రటరీ శివకుమార్‌ శనివారం ఈసీని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని, తన ప్రసంగంతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. 30వేలమంది ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, స్వయం సహాయక సంఘం గ్రూప్‌లను బెదరిస్తున్నారన్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌బీఎస్‌, పీఎల్‌ఆర్‌బీఎస్‌లో కొంతమంది మహిళలు టీడీపీ కండువాలు కప్పుకుని  ప్రచారం చేస్తున్నారని శివకుమార్‌ అన్నారు. ఈ అంశంపై నిన్న ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు