కోడ్ ఉల్లంఘిస్తే జైలుకే!

25 Mar, 2014 02:35 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రచారం కోసం ఎలక్ట్రానిక్ ప్రచార సాధనాల ద్వారా ప్రచారాన్ని, ప్రకటనలు ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
 
ప్రచారం చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు జిల్లా మానటరిం గ్ సెల్ అండ్ మోనిటరింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకో వాలన్నా రు. రిజిస్టర్ అయిన పార్టీలు మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకుంటే కమిటీ పరిశీలించి ఆమోద ముద్ర వేయడం కాని తిరస్కరించడం కానీ చేస్తుందన్నారు.
 
అలాగే రిజిస్టర్ కాని పార్టీలు ఏడురోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నిబంధన ప్రింట్ మీడి యాకు వర్తించదని తెలిపారు. దరఖాస్తులను తిరస్కరించినట్లురుుతే వాటిపై ఎన్నికల కమిషన్‌కు అప్పీలు చేసుకోవచ్చునన్నారు. ఇద్దరు సభ్యులు కలిగిన ఈ కమిటీకి ఎంపీ రిటర్నింగ్ అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు. సాఫ్ట్ కాపీ, ఎలక్ట్రానిక్ కాపీలతో పాటు ప్రకటన ధరను, ప్రకట నకు మీడియా ప్రతిపాదించిన ధరల వివరాలలు కూడా అం దించాలన్నారు.
 
అలాగే దరఖాస్తుతో పాటు సంబంధిత బా ధ్యు డు లేఖ అందించాలన్నారు. ప్రకటనను ఎవరి పేరు మీద ఇస్తున్నారన్న లేఖ కూడా ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి చెక్ లే దా డీడీల ద్వారా చెల్లింపు వివరాలు అందించాలని, వాటిని తా ము రాష్ట్ర కమిటీకి నివేదిస్తామన్నారు. రాష్ట్ర కమిటీలో జాయింట్ సీఈఓ చైర్మన్‌గా కమిటీ ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీ ఎంపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చైర్మన్‌గా కమిటీ ఉందన్నారు.
 
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడమే కాకుండా రెం డేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పెయిడ్ న్యూస్‌పై కూ డా మానటరింగ్ సెల్ నిఘా ఉంటుందన్నారు. ఇలా ఏదేని ఒక పత్రికలో ఒక అభ్యర్ధి గూర్చి పదే పదే వార్తలు వస్తే వాటిని చెల్లింపు వార్తల కింద పరిగణించి ఆయా పత్రికల ధరలననుసరించి అభ్యర్థి ఎన్నికల ఖర్చులో జమ చేస్తామని చెప్పారు. ప్రతీ అభ్యర్థి కూడా ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు.
 
అలాగే ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా లో కూడా ఈ విధమైన ప్రకటనలు, ప్రచారాలు నిషేధించినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము తప్పనిసరిగా ఉల్లంఘనుల సమా చారాన్ని అందిస్తామన్నారు.వీటిని పరిశీలించడానికి కలెక్టరేట్‌లోని ఎంసీఎంసీ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు.
 
ఈ విభాగాన్ని ఎన్నికల సిబ్బంది తో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సిటీ కేబుల్, లోకల్ ఛానల్స్ వంటి ప్రసార సాధనాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని చేపట్టడం చట్టవిరుద్ధమని చెప్పారు. ఆయనతో పాటు ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు కూడా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు