అందని ఉచిత వడ్డీ

22 Feb, 2014 03:31 IST|Sakshi
అందని ఉచిత వడ్డీ

 చీపురుపల్లి  :
 మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు స్వయం సహా యక సంఘాలకు వడ్డీలేని రుణా లు అందిస్తున్నట్టు  ప్రభుత్వంచెబుతోంది.అయితే వాస్తవ పరి స్థితి మాత్రం దీనికి విరుద్దంగా ఉంది. మహిళా సం ఘాలకు 2012లో రావాల్సిన వడ్డీ రాయితీ ఏడాదిన్నర గడిచినా ఇంతవరకూ రాలేదు.  
 
  మరికొద్ది రోజుల్లో ప్రభు త్వం గడువు తీరుతున్న సమయంలో ఇంక రాయితీ రాదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రుణాలు తీసుకున్న మహిళా సంఘాల సభ్యులు ఏకంగా రూపాయి వడ్డీ చెల్లించుకునే దుస్థితి ఏర్పడింది. దీంతో మండలంలో మహిళా సంఘాల సభ్యులు లబో దిబోమంటున్నారు.
 
  మండలంలో 17 పంచాయతీ ల్లోను 1014 మహిళా సంఘాలు ఉన్నాయి. వీరందరూ అప్పటి వరకూ పావలావడ్డీపై రుణాలు పొందేవారు. తరువాత ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం వడ్డీలేని రుణాలు పొందేందుకు అర్హత పొందారు. దీనిలో భాగంగా రుణాలు తీసుకున్నారు. 2012 జనవరి  నుం చి జూన్ వర కూ వీరికి ప్రభుత్వం వడ్డీలను బ్యాంకులకు జమ చేయలేదు. దీంతో మహిళా సంఘాలు చేసేది లేక వారు తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లిం చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
 
  మండల వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు 2012 లో ఆరు నెలలకు గాను ఏకంగా ప్రభుత్వం రూ.75 లక్షలు బకాయి పడింది. 1014 మహిళా సంఘాలకు గాను ఒక్కో నెలకు 11 నుంచి 15లక్షల రూపాయిలు వరకు బకాయి లు ఉన్నాయి. 2012 జూన్ తరువాత వడ్డీ రాయితీ కల్పించిన ప్రభుత్వం పాత బకా యిలు మాత్రం పట్టించుకోవడం లేదని మహిళలు  వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికా రులు స్పందించి తమకు ఆరు నెలలకు రావాల్సిన వడ్డీ రాయితీలు విడుదల చేయాలని కోరుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు