పదవి కాదు.. పనిచేయడం గొప్ప

27 Oct, 2013 01:20 IST|Sakshi

తాండూరు, న్యూస్‌లైన్: పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన కార్యకర్తలను అధిష్టానం గుర్తిస్తుందని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ పేర్కొన్నారు. తాండూరులో శనివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పాటుపడాలన్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కంకబద్ధులై పనిచేయాలన్నారు. పదవి వచ్చిందని చెప్పుకోవడం గొప్ప కాదని, అది బాధ్యతగా గుర్తించి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ నిజమైన తెలంగాణ తల్లి అని అన్నారు. పార్టీ పటిష్టానికి త్వరలో మండలాల వారీగా పర్యటిస్తానని చెప్పారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు మంత్రి ప్రసాద్‌కుమార్ అధికారులతో సమీక్షించారన్నారు. ప్రభుత్వం రైతులను తప్పకుండా ఆదుకుంటుందన్నారు. రింగు రోడ్డు వద్ద పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
 
  డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను విస్మరించొద్దన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్ మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్‌ఆర్, ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ  చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ  చైర్మన్ మహిపాల్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అపూ, నాయకులు శ్రీనివాసాచారి, బస్వరాజ్, సీసీఐ రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, నీలకంఠం, ప్రభాకర్‌గౌడ్, హేమంత్‌కుమార్, లక్ష్మణ్‌నాయక్, రియాజ్, సంతోష్‌గౌడ్, ముజీబ్, ఫిరోజ్‌ఖాన్, రత్నం, హరిగౌడ్, ఎస్పీ రవి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు