డాక్టర్ జయప్రకాష్‌రెడ్డికి బంగారు పతకం

19 Sep, 2013 01:18 IST|Sakshi
 కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: గుంటూరు పట్టణంలో ఈ నెల 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి 37వ ఈఎన్‌టీ సదస్సులో కర్నూలుకు చెందిన ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్ జయప్రకాష్‌రెడ్డికి బంగారు పతకం లభించింది. ఈ వివరాలను బుధవారం స్థానిక ఎన్‌ఆర్ పేటలోని శ్రీ సత్యసాయి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. గతంలో చెవి కర్ణబేరిలో పెద్ద రంధ్రం ఏర్పడితే మామూలు శస్త్రచికిత్స పద్దతిలో ఆశించిన ఫలితాలు ఉండేవి కావన్నారు.  ‘ఎక్ట్సెండెడ్ టింపానోమీటర్ ఫ్లాప్ టెక్నిక్’ అనే ఆధునిక పద్దతి  ద్వారా చేసే శస్త్రచికిత్స వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చేసి నిరూపించడం ద్వారా తనకు బయ్యా శ్రీనివాసరావు బంగారు పతకం అందజేశారని చెప్పారు.
 
 ఈ సదస్సులోనే డాక్టర్ రాజన్ పేరిట ఇచ్చే బంగారు పతకాన్ని కూడా తనకే వచ్చిందన్నారు. ప్రమాదవశాత్తూ చిన్న పిల్లల శ్వాస నాళాల్లో ఇరుక్కునే అన్యపదార్థాలు ప్రాణాంతకంగా ఉండేవన్నారు. వాటిని తీసివేయడానికి గతంలో పెద్ద సమస్యగా ఉండేదని, ‘టెలిస్కోపిక్ ఫోర్‌సెప్స్’ ద్వారా తొలగించడం రోగి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు పలుమార్లు చికిత్సలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. డాక్టర్ రాజన్‌రాజు పేరు మీదుగా ఇచ్చే ప్రశంసాపత్రం కూడా తనకు లభించిందన్నారు. గతంలోనూ అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని 9 బంగారు పతకాలు, 9 ద్వితీయ బహుమతులు సాధించినట్లు ఆయన వివరించారు.   
 
మరిన్ని వార్తలు