ఇటలీ నుంచి వచ్చిన 75మందికి ఆరోగ్య శాఖ సూచనలు!

11 Mar, 2020 15:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన భారతీయులంతా కోవిడ్‌-19(కరోనా వైరస్‌) నేపథ్యంలో తప్పనిసరిగా 14 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి వారిని కోరారు. కాగా బుధవారం ఇటలీ నుంచి ఏపీకి నాలుగు విడతలుగా 75 మంది భారత ప్రయాణికులు ఏపీకీ వచ్చారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక గదుల్లోనే ఉండాలని ఆయన  సూచించారు. గుదుల్లో ఉన్నన్ని రోజులు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరనీ కలవోద్దని హెచ్చిరించారు. అలాగే వారి గది దరిదాపుల్లోకి కూడా పెద్దవాళ్లను కానీ చిన్నపిల్లలు వెళ్లకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారు తరచు చేతులను సబ్బుతో కానీ హ్యాండ్‌వాష్‌లతోని కడుక్కోవాలని చెప్పారు. ఇతరులు తమ బట్టలు, టవళ్లు, తదితర వాటిని ముట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. వారి రూంకు అటాచ్డ్‌ బాత్‌రూం ఉంటే దానిని వారు మాత్రమే వాడాలని, ఇతరులు వాడకూడదని తెలిపారు. ఒకవేళ ఇంట్లో ఒకే బాత్‌రూం ఉంటే మిగతా కుటుంబ సభ్యలు వాడాకే వారు వాడాలని చెప్పారు. 

కరోనాతో వ్యక్తి మృతి : భారత్‌లో తొలి కేసు..!

కోవిడ్‌ గుప్పిట్లో ఇటలీ 

 బాత్రూమును వాడాక..

  • 1 శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో గానీ , లైసోల్‌తో గాని శుభ్రం చేయాలి. 
  • వారు వాడే సబ్బులూ, షాంపూలూ, టవళ్లను ఇతరులు ముట్టుకోవడంగానీ, వాడడంగానీ చెయ్యొద్దు.
  • వారికి ఆహారాన్ని తమ వాళ్లు వారున్న రూం డోర్ బయటి నుంచే ఇవ్వాలి.
  • ఆహారం తీసుకున్నాక ప్లేట్ని శుభ్రంగా కడిగి డోర్ బయటే పెట్టేయాలి.
  • మీకు సంబంధించిన వేస్టేజీని సెపరేట్ బ్యాగులో వేసి రూం బయట పెట్టాలి.
  • ఇంట్లో వేస్టేజీకి కూడా రెండు బ్యాగులు వాడాలి.
  • వీరికి ఎటువంటి దగ్గు , జ్వరము , శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలి.
  • 24 గంటలూ పని చేస్తున్న కంట్రోల్ రూం నంబరు 0866 - 2410978కు అలాగే ఆరోగ్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేయాలి.
  • వైద్యుల సలహా మేరకు ఆసుపత్రికి రావాల్సి వస్తే 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి అందులోనే వెళ్లాలి.
మరిన్ని వార్తలు