ఆర్‌సీఐలో ఘనంగా ‘డీఆర్‌డీవో డే ’ వేడుకలు

2 Jan, 2014 00:23 IST|Sakshi
ఆర్‌సీఐలో డీజీపీ ప్రసాదరావును సన్మానిస్తున్న సతీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ)లో బుధవారం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీజీపీ తన పరిశోధన ‘వ్యతికరణం, వివర్తనం-ఓ కొత్త సిద్ధాంతం’పై ఈ సందర్భంగా సాంకేతిక ప్రదర్శన ఇచ్చారు. ఆర్‌సీఐ డెరైక్టర్ సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ... ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే శాస్త్ర పరిశోధనలు నిర్వహిస్తున్నందుకు డీజీపీ ని అభినందించారు. సమష్టి కృషితో ఆర్‌సీఐని ప్రపంచస్థా యి ప్రయోగశాలగా నిలబెట్టగలమన్నారు.
 
 సమస్యలను సమష్టిగా అధిగమిద్దాం
 శాంతిభద్రతల పరిరక్షణలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సమష్టిగా కృషి చే యాలని డీజీపీ పిలుపునిచ్చారు. బుధవారం పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బం దితో పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆందోళనల వల్ల సిబ్బంది తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పటికీ సమర్ధవంతంగా పనిచేశారని డీజీపీ ప్రశంసించారు. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీస్‌కే కౌముది, అదనపు డీజీలు ఏఆర్ అనురాధ,  సురేంద్రబాబు, వీకే సింగ్,  గోపికృష్ణ తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు.

మరిన్ని వార్తలు