తాగునీటికే ప్రాధాన్యం

16 Jul, 2014 02:25 IST|Sakshi
తాగునీటికే ప్రాధాన్యం

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
 వేంపల్లె : జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌వల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డితో కలసి మంగళవారం ఆయన వేంపల్లె మండలం ముతుకూరు, నందిపల్లె, కత్తలూరులో పర్యటించారు.
 
 తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల వేంపల్లె మండల నాయకులతో సమావేశమైన సమయంలో పై గ్రామాల్లో తలెత్తిన తాగునీటి ఎద్దడి, సిమెంట్ రోడ్ల అవసరాన్ని వారు వివరించారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఆ గ్రామాల్లో పర్యటించారు. తాగునీటి పథకాన్ని ఆయన నిచ్చెన ఎక్కి స్వయంగా పరిశీలించారు.
 
 తరువాత పరిస్థితిపై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శేషఫణి, ఏఈ ఖాదర్‌బాషాతో చర్చించారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. వాటి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు.  ఎంపీటీసీ సభ్యులు ఎన్.గంగిరెడ్డి, కె.వెంకటేశ్, సర్పంచ్‌లు ఆర్‌ఎల్‌వీ ప్రసాద్‌రెడ్డి, మునెమ్మ, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, సింగిల్ విండో డెరైక్టర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు