వాటర్ గ్రిడ్‌ల ద్వారా తాగునీరు

21 Aug, 2014 02:20 IST|Sakshi

 ఏపీ మంత్రివర్గ ఉపసంఘం వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: సముద్రం పాలవుతున్న నదీ జలాలను అరిక ట్టి ప్రజల అవసరాలకు, పరిశ్రమలకు నీటిని అందజేసేందుకు ఏపీ రాష్ట్రంలో ఆరు వాటర్‌గ్రిడ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇందుకోసం తాను, మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించినట్లు చెప్పారు. ఆయన బుధవారం సాయంత్రం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. 13 జిల్లాలను 6 జోన్లుగా విభజించి వాటిలో వాటర్‌గ్రిడ్‌లను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
 

మరిన్ని వార్తలు