నకిలీ అధికారుల ఆటకట్టు

29 Aug, 2013 03:20 IST|Sakshi

భీమారం, న్యూస్‌లైన్ :  ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం నుంచి వచ్చామ ని వివిధ ప్రాంతాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను కాకతీయ యూనివర్సిటీ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం పోలీస్‌స్టేష న్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ దేవేందర్‌రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన ఖమ్మం యాదగిరి, హన్మకొండ  ప్రాంతంలోని బొక్కలగడ్డకు చెందిన మేకల ఆనందం, వరంగల్‌కు చెందిన విద్యాసాగర్, పెగడపల్లి డబ్బాల ప్రాంతానికి చెందిన పవన్‌లు అక్రమ సంపాదన కోసం కొంతకాలంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు.

తాము ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు, సిబ్బందిమని చెబుతూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, స్వీట్‌హౌస్‌లను తనిఖీ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలో పవన్ అనే వ్యక్తి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, ఖమ్మం యాదగిరి, మేకల ఆనందం, విద్యాసాగర్ ఆహార కల్తీ నిరోధకశాఖ ఉద్యోగులుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో  బుధవారం యాదగిరి, మేకల ఆనందం, విద్యాసాగర్ నయీంనగర్ సమీపంలోని ఓ స్వీట్ హౌ స్‌కు వెళ్లి తమను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ పంపించారని యజమానికి చెప్పారు.

అనంతరం సెల్‌లో ఓ నంబర్ డయల్ చేసి మీతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాతారని సెల్‌ను స్వీట్‌హౌస్ యజమానికి ఇచ్చారు. ఈ సం దర్భంగా ఫోన్‌లో అవతల వైపు నుంచి మాట్లాడుతు న్న వ్యక్తి నేను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌నని... మీ వద్దకు వచ్చిన వారు మా సిబ్బందేనని.. వారికి రూ.2,500లు ఇచ్చి పంపించండి అని.. ఆదేశించాడు. అయితే తాను దుకాణం ఇప్పుడే తెరిచానని.. తమ సిబ్బందిని సా యంత్రం పంపిస్తే డబ్బులు ఇస్తానని ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తికి యజమాని సమాధానం ఇచ్చాడు. అనంతరం వారు అక్కడి నుంచి సమ్మయ్య నగర్‌లోని ఓ బేక రీ వద్దకు వెళ్లి అదే తరహాలో మళ్లీ అక్కడి యజమానికి ఫోన్ చేయించారు.
 
అనుమానంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్  కార్యాలయానికి ఫోన్...

అయితే తమ బేకరికి వచ్చిన వారు కొత్తగా ఉన్నారని అనుమానం వ్యక్తం చేసిన యజమాని పక్కకు వెళ్లి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేశాడు. కార్యాల యం నుంచి మా బేకరీకి ఎవరినైనా పంపించారా అని అక్కడి అధికారులను అడుగగా వారు ఎవరిని పం పించలేదని సమాధానం ఇచ్చారు. అనంతరం కార్యాల య అధికారులు హుటాహుటిన సమ్మయ్యనగర్‌కు చేరుకుని బేకరి దుకాణ  యజమానిని డబ్బులు అడుతు న్న ముగ్గురిని పట్టుకుని కేయూ పోలీసులకు అప్పగిం చారు. ఆహార కల్తీ నిరోధన శాఖ అధికారులు, సిబ్బం దిమంటూ హోటల్, స్వీట్‌షాపుల నుంచి డబ్బులు వ సూలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులు కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
పరారీలో వపన్...


 కాగా, అక్రమ వసూళ్లలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరించిన పవన్ పరారీలో ఉన్నట్లు సీఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు. డబ్బుల వసూలుకు వచ్చిన పవన్ అనుచరులు యాదగిరి,  ఆనందం, విద్యాసాగర్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.
 
ఇద్దరిది నేరచరిత్ర...


 ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల ముఠాలో డబ్బులు వసూలు చేస్తున్న న లుగురిలో ఇద్దరు నేర చరిత్ర కలిగి ఉన్నారని సీఐ తె లి పారు. ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ పేరుతో వ్యవహరించిన పవన్ పై నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులున్నాయన్నారు. నకిలీ ముఠాలో సిబ్బందిగా చెలామణి అయిన ఖమ్మం యాదగిరి గతంలో ఆర్‌ఎస్సైగా పనిచేశాడని, విధులపట్ల సత్ప్రవర్తనలేకపోవడంతో ప్రభుత్వం అతడిని సర్వీస్ నుంచి తొలగించిం దన్నారు. అలాగే దామెర ఆనందం కార్పొరేషన్ ఉద్యోగికాగా, విద్యాసాగర్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
నకిలీలపై అప్రమత్తంగా ఉండాలి : సీఐ


 ప్రస్తుతం నగరంలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఆధార్ కా ర్డులు ఇప్పిస్తామని, బంగారు పూత వేస్తామని వస్తున్న వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ దేవేందర్‌రెడ్డి కోరారు. తమ దగ్గరికి వచ్చిన వ్యక్తుల తీరుపై అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో ఎస్సై రవికిరణ్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు