పోలీసులమని బెదిరించి రూ. 5.32లక్షల అపహరణ

24 Oct, 2013 02:36 IST|Sakshi

సదాశివనగర్,న్యూస్‌లైన్ : పోలీసులమని చెప్పి పిస్తల్ చూపించి ఓ వ్యక్తి వద్ద నుంచి నగదును అపహరించుకు వెళ్లిన సంఘటన సదాశివనగర్ మండలంలోని ధర్మారావ్‌పేట్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. బాధితుడు శ్రీనివాస్ వివరాల ప్రకారం... కామారెడ్డి పట్టణంలోని వాణి నవశక్తి బీడీ కంపెనీలో పనిచేసే శ్రీనివాస్ బుధవారం సదాశివనగర్‌లో గల కంపనీ ఖార్కానాల్లో కార్మికులకు డబ్బులు పంచేందుకు వెళ్లాడు. అక్కడ పనిపూర్తి చేసుకుని మిగతా *5.32 లక్షలతో ధర్మారావ్‌పేట్ గ్రామం వైపు బైక్‌పై బయలుదేరాడు.

గ్రామ శివారులోకి వెళ్లగానే వెనుక వైపు నుంచి అపాచి బైక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వేగంగా ముందుకు వచ్చి బైక్‌ను ఆపారు. నీ వద్ద నకిలీ నోట్లు ఉన్నట్లు మాకు సమాచారం వచ్చిందని...పిస్తల్‌తో బెదిరించి చేతి బ్యాగ్‌లో ఉన్న డబ్బులను లాక్కుని పరారయ్యారు. వెంటనే బాధితుడు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంగతి చెప్పగా పోలీసులు నివ్వెరపోయారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి సీఐ సుభాష్ చంద్రబోస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీఐ వెంట ఎస్సై సైదయ్య, ఏఎస్సై నర్సయ్య, సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు