పాలనాపరమైన అంశాల్లో... మీ జోక్యం అనవసరం!

18 Dec, 2018 13:24 IST|Sakshi
బోర్డు మీటింగ్‌లో దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ, చైర్మన్‌ గౌరంగబాబు, ఇతర సభ్యులు

మరోసారి దుర్గగుడిఈవో వర్సెస్‌ చైర్మన్‌

బోర్డు సమావేశంలో బయటపడ్డ విభేదాలు

ఉద్యోగులకు మద్దతుగా చైర్మన్‌

ఈవో తీరుపై అలిగి వెళ్లిపోయిన వైనం

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ గౌరంగబాబు, ఆలయ ఈవో వి. కోటేశ్వరమ్మల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.    దసరా ఉత్సవాలలో కళాకారులకు దేవస్థానం పంపిణీ చేసిన మెమెంటోల వ్యవహారంలో ఆలయ ఈవో పలువురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో  ఛైర్మన్‌ గౌరంగబాబు  ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. తాజాగా సోమవారం దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రం బోర్డు మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఈ వ్యవహారం మరోమారు చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఉద్యోగుల వ్యవహారంపై పాలక మండలి సభ్యులు చర్చకు తీసుకురాగా సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది.  అయితే ఆలయ చైర్మన్‌పై ఈవో వి. కోటేశ్వరమ్మ విరుచుకు పడ్డారు. సస్పెండైన ఉద్యోగులను వెనక్కి తీసుకోవాలని లెటర్‌ ఇచ్చింది చైర్మన్, కాబట్టి చైర్మన్‌ను అడగండి అంటూ ఈవో ఆగ్రహం గా చెప్పడంతో  పాలక మండలి సభ్యులం దరూ ఆవాక్కయ్యారు.

‘పాలనాపరమైన వ్యవహారంలో జ్యోకం చేసుకోవద్దని’ చెప్పడంతో చైర్మన్‌ అలిగి వెళ్లిపోయారు. తొలుత బోర్డు మీటింగ్‌లో పాల్గొన్న చైర్మన్‌ మీడియా సమావేశంలో పాల్గొనకుండానే వెళ్లిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు