బదిలీల్లో ఇదేం పాయింటు..

1 Sep, 2015 00:27 IST|Sakshi
బదిలీల్లో ఇదేం పాయింటు..

పనితీరు పాయింట్ల కేటాయింపుపై వ్యక్తమతున్న భిన్నాభిప్రాయాలు
ఇలాగైతే నష్టపోతామంటున్న టీచర్ సంఘాల ప్రతినిధులు

 
మురళీనగర్(విశాఖ): ఉపాధ్యాయుల బదిలీలలకు సంబంధించి విడుదలైన షెడ్యూలుపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేసినప్పటికి పనితీరుకు సంబంధించి పాయింట్ల కేటాయింపుపై వీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగుపై ఏకాభిప్రాయం కుదిరినా పాయింట్ల కేటాయింపులో పారదర్శకత, స్పష్టతపై సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సంఘ ప్రతినిధులు లేవనెత్తుతున్న అభ్యంతరాలివీ!

దాతల సాయంతో పాఠశాల అభివృద్ధికి నిధుల సేకరణ చేసిన వారికి పాయిట్ల కేటాయింపు అనేది బోధనకు ప్రాధాన్యతనిచ్చే ఉపాధాయునికి చేతకాకపోవచ్చు ఇలాంట ప్పుడు ఆ ఉపాధ్యాయుడు పాయింటుల నష్టపోతాడు. గ్రామీణ ప్రాంతాల్లో నిధుల సమీకరణ సాధ్యం కాదు.

హాజరు శాతంకు సంబంధించి మహిళా ఉపాధ్యాయులు ప్రసూతి సెలవులు, పురుష ఉపాధ్యాయులు పెటర్నటీ లీవ్, ఉన్నత విద్యార్హతల కోసం లాంగ్ లీవ్ వాడుకునే వారు నష్టపోవాల్సిందేనా?పదోతరగతిలో ఫలితాల ఆధారంగా పాయింట్లు కేటాయింపు అనేది తక్కువ విద్యార్థులున్న పాఠశాలలకే న్యాయం జరుగుతుంది. వందమందికి పైగా పదోతరగతి పరీక్షలు రాసిన పాఠశాలలో ఒక్కరు పరీక్ష తప్పినా ఎక్కువ శాతం పడిపోతుంది. ఒక సబ్జెక్టులో విద్యార్థి పరీక్ష తప్పితే అది ఇతర సబ్జెక్టు ఉపాధాయులపై ప్రభావం పడుతుంది.

పదోతరగతి బోధించని ఉపాధ్యాల మాటేమిటి?
అవార్డులు పొందిన వారికి పాయింట్లు కేటాయించడం వల్ల జూనియర్లకు అన్యాయం జరుగుతుంది. గతంలో జాతీయ పురస్కారానికి 15పాయింట్లు, రాష్ట్ర అవార్డుకు 10మార్కులు కేటాయించేవారు. ఇప్పుడు అన్నిటికి ఒకే విధంగా 5పాయింట్లు ఇస్తామంటున్నారు.

పిల్లల నమోదుపెరుగుదలకు సంబంధించి పాఠశాల వయసుగల పిల్లలు తగ్గిపోతున్న ఆవాసప్రాంతాల పరిస్థితి ఏమిటి?గతేడాది 3,5,8తరగతుల్లో ఎ, ఎ-ప్లస్, శ్రేణుల్లో 80శాతం ఉత్తీర్ణత సాదించిన పిల్లలు ఉంటే రెండు పాయింట్లు కేటాయిస్తామంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఉత్తీర్ణత శాతం ఆధారపడి ఉంటుంది. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయకుండా పాయింట్లు నిర్ధారణ ఎలా చేస్తారనేది సందేహమే.ఉపాధాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే అదనంగా పాయింట్లు ఇస్తామంటున్నారు. ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాల స్థాయిలో అభ్యసించడానికి పిల్లలు లేనివారు నష్టపోతారు.
     
పాఠశాలల్లో పీఈటీలు, క్రీడా మైదానాలు లేకుండా ఈ విభాగంలో పాయింట్లు కేటాయింపు విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉంది.పాయింట్ల కేటాయింపులో సవరణ లు చేసి మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టి మెజార్టీ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా చూడాలని  వైఎస్సార్ టిఎఫ్, ఏపీటిఎఫ్(1938) సంఘాల జిల్లా అధ్యక్షులు చిరికి శ్రీనివాసరావు,ఎం.జే.సేవియర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తాము విద్యాశాఖ కార్యదర్శికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు