26 నుంచి ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

10 Feb, 2019 04:39 IST|Sakshi

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మార్చి 27

ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సాయిబాబు వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ఎంసెట్‌–2019కు ఈ నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. శుక్రవారం జరిగిన ఎంసెట్‌ నిర్వహణ కమిటీ సమావేశంలో షెడ్యూల్‌ తేదీలను నిర్ణయించారు. ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 27 వరకు ఉందని, ఏప్రిల్‌ 20 నుంచి పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహించి ఫలితాలను మే 5న ప్రకటించనున్నామని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ సాయిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఎంసెట్‌ షెడ్యూల్‌ వివరాలివీ..  
ఎంసెట్‌–2019 నోటిఫికేషన్‌ జారీ:(ఫిబ్రవరి 20),ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం(ఫిబ్రవరి26), ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువు(మార్చి27), రూ.500 ఆలస్య రుసుముతో గడువు(ఏప్రిల్‌04),రూ.1,000 ఆలస్యరుసుముతో గడువు   (ఏప్రిల్‌ 09),రూ.5,000 ఆలస్యరుసుముతో గడువు(ఏప్రిల్‌ 14), వెబ్‌సైట్‌నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌(ఏప్రిల్‌ 16 నుంచి), రూ.10,000 ఆలస్య రుసుముతో గడువు(ఏప్రిల్‌ 19), ఇంజనీరింగ్‌ కేటగిరీ పరీక్షల తేదీలు(ఏప్రిల్‌ 20, 21, 22, 23), అగ్రికల్చర్‌ కేటగిరీ పరీక్షల తేదీలు(ఏప్రిల్‌ 23, 24),ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ రెండు కలిపి(ఏప్రిల్‌ 22, 23),పరీక్ష సమయం(ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు),(మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు),(మే 05),ఫలితాల విడుదల అని వెల్లడించారు.

మరిన్ని వార్తలు