గురుకుల విద్యార్థులకు ఎంసెట్‌లో ప్రత్యేక శిక్షణ

15 Apr, 2019 11:34 IST|Sakshi
జి.కె వీధిలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు

బాలికలకు జీకే వీధి, బాలురకు అరకులో శిక్షణ

మూడు జిల్లాల్లోని గురుకుల చెందిన విద్యార్థులకు చక్కటి అవకాశం

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్ధులు

విశాఖపట్నం, గూడెంకొత్తవీధి (పాడేరు) : ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడికల్‌ సీటు పొందేందుకు మూడు జిల్లాల్లోని గురుకుల చెందిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జీకే వీధి గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మకుమారి అన్నారు. ఇంటర్‌ మొదటి, ద్వి తీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థు లకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రధానంగా మెడికల్, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ పరీక్షకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

విశాఖ జిల్లా బాలికలకు జీకే వీధిలో, బాలురకు అరకులోయలో ఈ శిక్షణ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కురుపాం, సీతంపేట, పి.కొత్తవలస, భద్రగిరి, అరకులోయ, జీకే వీధి గురుకుల కళాశాలలకు చెందిన బాలికలకు జీకే వీధి, జి.మాడుగుల, కొయ్యూరు, అరకులోయ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన బాలురకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 14 నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి కళాశాల నుంచి 100 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని, వీరందరికి వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.  ఎంసెట్‌లో మెడికల్, ఇంజినీరింగ్‌ సీట్లు పొం దేందుకు విద్యాశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ శిక్షణ ఎంతో అవసరం
మెడికల్, ఇంజినీరింగ్‌ సీట్లు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివే పేద విద్యార్థు లకు ఎంతో డబ్బులు ఖర్చుపెట్టి కోచింగ్‌ తీసుకుంటుంటారు. అయితే విద్యాశాఖ ద్వారా గురుకుల విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరం. ఇది ఎంతో ఉపయోగపడుతుంది.– అశ్వని, కురుపాం, విజయనగరం జిల్లా

>
మరిన్ని వార్తలు