సూర్యగ్రహణంతో భూకంపాలు.. సునామీలు

20 Aug, 2017 03:39 IST|Sakshi
సూర్యగ్రహణంతో భూకంపాలు.. సునామీలు
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 21వ తేదీన ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల భూకంపాలు, సునామీలు, టోర్నడోలు ఏర్పడే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1979 సంవత్సరం తర్వాత ఏర్పడనున్న అతి పెద్ద సూర్యగ్రహణం ఇదేనని వారు చెబుతు న్నారు. ఈ సూర్యగ్రహణం అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో తప్ప భారత్‌లో కనిపించదని తెలిపారు. అమెరికాలో 21న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంటే.. దాదాపు ఆరు గంటలపాటు ఈ గ్రహణం కొనసాగ నుంది.

సుదీర్ఘంగా గ్రహణం ఏర్పడటం వల్ల ఉపరి తలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తగ్గుతాయని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా తగ్గినప్పుడు ఆయా ప్రాంతాల్లో టోర్నడోలు, భూకంపాలు, సునామీలకు ఆస్కారం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.  ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా తదితర ప్రాంతాల్లో పగటిపూట ఏర్పడటం వల్ల మనదేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుంది. అందువల్ల ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదని రిటైర్డ్‌ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అంతేగాక ఈ సూర్యగ్రహణ ప్రభావం మన దేశంపై ఉండబోదన్నారు.

అందువల్ల పుకార్లను నమ్మవద్దని సూచించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్‌లపైనే ఉండే అవకాశముం దన్నారు. ఇలాంటి సుదీర్ఘ సూర్యగ్రహణం మళ్లీ 2,500 సంవత్సరంలోనే ఏర్పడుతుందన్నారు. సోమవారం ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం మనుషులు, జంతువులు, వాతావరణంపై ఎలా ఉంటుందోనని నాసా పరిశోధనలు చేస్తోంద న్నారు. ఇప్పటికే అమెరికాలో సూర్యగ్రహణ ప్రభావంతో టోర్నడోల ప్రభావం మొదలైందని చెప్పారు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు