ఉలిక్కిపడ్డ గన్నవరం

11 Oct, 2017 07:07 IST|Sakshi

సాక్షి, గన్నవరం : కృష్ణా జిల్లా బుధవారం తెల్లవారుజామున ఒక్కసారి ఉలిక్కిపడింది. గన్నవరం, పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. పది నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి 10.15 గంటల సమయంలో గన్నవరంతోపాటు కేసరపల్లి, బుద్ధవరం, మర్లపాలెం, విఎన్‌ పురం, దుర్గాపురం, దావాజీగూడెం, ముస్తాబాద ప్రాంతాల్లో భూమి కంపించింది.

ఇళ్లల్లోని వస్తువులు కదలడంతో ప్రకంపనల్ని గుర్తించిన ప్రజలు భయంతో బయటకు వచ్చారు. అపార్ట్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారికి ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాత్రి 11 గంటల సమయంలో మరోసారి  కంపించినట్లు కొందరు తెలిపారు. ఈ ప్రాంతంలో 2015 తర్వాత  భూప్రకంపనలు రావడం ఇది రెండోసారి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లావారే వరకూ  బిక్కుబిక్కుమంటూ ఆరు బయటే గడిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు