తూర్పుగోదావరి జిల్లాకు ఇస్రో హెచ్చరిక!

20 May, 2017 15:07 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లాకు ఇస్రో హెచ్చరిక!

పచ్చటి కొబ్బరిచెట్లు, ప్రతి ఊళ్లోనూ కాలువలు, చల్లటి పిల్లగాలి వీచే తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే మూడు నాలుగు రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అదిరిపోతాయట. ఈ విషయం చెప్పింది కూడా వాళ్లూ, వీళ్లు కాదు.. స్వయానా ఇస్రో అధికారులు. తూర్పు గోదావరి జిల్లాలో రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయని, అవి 52 డిగ్రీల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని ఇస్రో హెచ్చరించినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ తెలిపారు.

ప్రధానంగా కోనసీమ ప్రాంతంలోని అమలాపురం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాలతో పాటు కాకినాడ సమీపంలోని ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని కలెక్టర్ కార్తికేయ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు