దళాలన్నీ.. బందూకులు చేతబూని..

18 Dec, 2014 01:58 IST|Sakshi
దళాలన్నీ.. బందూకులు చేతబూని..

 జంగారెడ్డిగూడెం :నాలుగు దశాబ్దాల క్రితం పశ్చిమ ఏజెన్సీలో వేళ్లూనుకుని.. సాయుధ పోరాటాలతో పచ్చని అడవుల్లో రక్తం చిందించిన దళాలు పదేళ్లుగా స్తబ్దుగా ఉండిపోయూయి. అడపాదడపా జరిగిన ఎన్‌కౌంటర్లు.. కూంబింగ్‌లు.. ఉద్యమ కేంద్రాలు మారడం వంటి పరిస్థితులు ఇందుకు కారణమయ్యూయి. తొలినాళ్లలో నక్సల్స్ కార్యకలాపాలు జిల్లాలోనూ కనిపించేవి. తదనంతరం సాయుధ పోరాటాన్ని ఉద్యమ బాటగా ఎంచుకున్న వారంతా మావోయిస్టులుగా రూపాంతరం చెందిన తరువాత దళాల ఉనికి పెద్దగా జిల్లాలో కని పిం చలేదు. దళ సభ్యులు ఈ ప్రాంతాన్ని కేవలం షెల్టర్ జోన్‌గా మాత్రమే ఉపయోగించుకునేవారు. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ప్రశాంతంగానే ఉంటూ వస్తోంది. అయితే రెండేళ్ల క్రితం సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) పార్టీ నుంచి విడిపోయిన కొందరు చంద్రన్న వర్గంగా ఏర్పడ్డారు. ఆ వర్గానికి అనుబంధంగా నెలకొల్పిన అశోక్ దళానికి చెందిన సభ్యులు కొంతకాలంగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించారు. ఆ దళానికి చెందిన 13 మంది సభ్యులను మంగళవారం వేకువజామున పోలీసులు అరెస్ట్ చేయడంతో సాయుధ దళాలు మరోసారి మన జిల్లాపై దృష్టి సారించారనే విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.
 
 42 ఏళ్ల చరిత్రలో...
 పశ్చిమ ఏజెన్సీలో చోటుచేసుకున్న పరి ణామాల నేపథ్యంలో 1972లో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) పార్టీ ఏర్పా టైంది. దానికి అనుబంధంగా అప్పట్లో ధర్మన్న, ధర్ముల సురేష్ నాయకత్వంలో దళాలు పనిచేసేవి. తొలినాళ్లలోనే బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి సమీపంలో అంతర్వేది గూడెం మునసబును దళ సభ్యులు కాల్చి చంపారని చెబుతారు. తదనంతరం దళ కమాండర్ ధర్ముల సురేష్, ఆయన భర్య పద్మక్కలను 1991లో బుట్టాయగూడెం మండలం లంకపాకల సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశా రు. ఆ తరువాత ఈ ప్రాంతంపై జనశక్తి పార్టీకి చెందిన దళాలు పట్టు సాధిం చారుు. 2000 సంవత్సరంలో పోల వ రం మండలం అటవీ ప్రాంతంలోని జలతారు వాగు వద్ద జనశక్తి నక్సల్స్, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కొందరు నక్సల్స్‌తోపాటు పోలీసులు కూడా మృత్యువాతపడ్డారు. 2001లో బుట్టాయగూడెం మండలం రామనర్సాపురం సమీపంలో ప్రజాపంథా పార్టీ న్యూ డెమోక్రసీ దళ కమాండర్ ధర్మన్న ఎన్‌కౌం టర్‌లో మరణించారు.
 
  ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు సైతం మృతి చెందారు. అదే ఏడాది పోలవరం మండలంలో జలతారు వాగు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ మృతి చెందారు. అదే సంవత్సరంలో పట్టిసీమ వద్ద జనశక్తి నక్సలైట్లను పోలీ సులు ఎన్‌కౌంటర్ చేశారు. 2003లో లక్ష్మీపురం వద్ద, పోలవరం మండలం గూటాల వద్ద ఎన్‌కౌంటర్లలో జనశక్తి దళానికి చెందిన సభ్యులు మృత్యువాతపడ్డారు. ఇదిలావుండగా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేటకు చెందిన ఒక వ్యాపారిని జనశక్తికి చెందిన నక్సలైట్లు హతమార్చారు. ఆ తరువాత దళ కమాండర్ క్రాంతి పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. తదనంతరం బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం సమీపంలో జనశక్తికి చెందిన నక్సల్స్ జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును దహనం చేశారు. 2004లో బుట్టాయగూడెం మండలం రెడ్డికోపల్లె సమీపంలో రమేశన్న దళం పోలీసులకు పట్టుబడింది.  
 
 ఆ తరువాత పదేళ్లపాటు సాయుధ దళాల అలికిడి ఈ ప్రాం తంలో పెద్దగా వినిపించలేదు. తాజాగా చంద్రన్న వర్గంలో పనిచేసేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన దళం పోలీ సులకు పట్టుబడింది. ఇలా అనుకోని ఘటనలతో అప్పుడప్పుడూ ఈ ప్రాం తం ఉలిక్కిపడుతూ ఉంటుంది. రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ప్రశాంతమైనదనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, ఏలేరుపాడు మండలాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు తరచూ కూంబింగ్ నిర్వహిస్తూ మావోల కదలి కలపై డేగ కన్ను వేస్తున్నట్టు సమాచా రం. తాజా పరిస్థితులు ఏజెన్సీలో ఉద్రిక్తంగా కనిపిస్తున్నారుు.
 
 దళ సభ్యులకు రిమాండ్
 జంగారెడ్డిగూడెం : ఆయుధాలతో పట్టుబడిన చంద్రన్న వర్గం దళ సభ్యులను జంగారెడ్డిగూడెం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్సై కె.శ్రీహరి తెలిపారు. వీరికి మేజిస్ట్రేట్ కె.మధుస్వామి 15 రోజుల రిమాండ్ విధించగా,  రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్సై వివరించారు.
 

మరిన్ని వార్తలు