మూడు రాజధానులు కావాల్సిందే

10 Jan, 2020 12:13 IST|Sakshi
ద్రాక్షారామలో ఎమ్మెల్యే వేణుతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు, విద్యార్థినులు

తూర్పుగోదావరి జిల్లాలో మహిళల భారీ ర్యాలీ

సాక్షి, ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్‌): రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మూడు రాజధానులు ఉండాల్సిందేనంటూ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామలో సుమారు 2 వేల మంది మహిళలు, విద్యార్థినులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ‘అమరావతి ఒక్కటే వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణు మాట్లాడుతూ.. రాష్ట్రమంతా ముక్త కంఠంతో మూడు రాజధానుల అవసరాన్ని ఎలుగెత్తి చాటుతుంటే, చంద్రబాబు, ఆయన అనుయాయులు మాత్రం తమ రియల్‌ ఎస్టేట్‌ ఆశలు ఆవిరి అయిపోతున్నాయని ప్రజల్లో అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏం చేసినా ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తారనే దృఢమైన నిర్ణయం ప్రజల్లో ఉందని, అందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు.

సీఎం జగన్‌ నిర్ణయం నూరు శాతం కరెక్ట్‌
తాళ్లరేవు: అమరావతి విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నది నూటికి నూరుపాళ్లు కరెక్ట్‌ అని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జార్జీపేట గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలని, లేదంటే రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా ఒక రాష్ట్రం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. సదుపాయాలు అందరికీ సమానంగా ఉండాలంటే ప్రతి జిల్లాలో అభివృద్ధి జరగాలని చెప్పారు.

సంబంధిత వార్తలు
చంద్రబాబును అడ్డుకుంటాం

వారిలో సమాజ హితం లేదు

అలా చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?

జగన్‌ అంటే చంద్రబాబుకు ద్వేషం: పోసాని

మరిన్ని వార్తలు