130 చోట్ల కంటైన్‌మెంట్‌ ప్ర‌క‌ట‌న‌..

27 Jun, 2020 14:43 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావ‌రి : జిల్లాలో క‌రోనా వైర‌స్ కేసులు వెయ్యి దాటాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 98, 340 మంది నుంచి శాంపిల్స్ సేక‌రించ‌గా, 1,060 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. వీరిలో 663 మంది ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, 386 మంది డిశ్చార్జి అయ్యారు. క‌రోనాతో 11 మంది మృత్యువాత‌ప‌డ్డారు. దీంతో అధికారులు 130 చోట్ల‌ను కంటైన్మెంట్‌గా ప్ర‌క‌టించారు. సామ‌ర్ల‌కోట అమ్మ‌ణ్ణ‌మ్మ గృహ  స‌ముదాయంలో 36 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ‌కాకినాడ జ‌గ‌న్నాథ‌పురాన్నిఅధికారులు రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించారు. మెయిన్‌రోడ్డులోని షాపుల‌ను అధికారులు మూసివేశారు. (ఏపీలో మరో 796 కరోనా కేసులు)

మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న‌ట్లు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు ప్ర‌క‌టించారు. ఉదయం ఆరు గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు వ్యాపార స‌ముదాయాలు తెర‌వాల‌ని సూచించారు. మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి 12 గంట‌ల నుంచి ప్ర‌జ‌లు రోడ్డు మీద‌కు రావొద్ద‌ని ఎమ్మెల్యే దొర‌బాబు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు