మరోసారి బట్టబయలైన పచ్చ మీడియా బండారం

22 Feb, 2020 20:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : అధికార వికేంద్రీకరణపై పచ్చ మీడియా బండారం మరోసారి బట్టబయలైంది. నేవీ పేరును ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాన్ని.. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని నేవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పీఐబీ రక్షణ విభాగం పత్రికా ప్రకటన విడుదల చేసింది. 

దృష్టి మరల్చే యత్నం..
తప్పుడు కథనాల ప్రచారం కోసం ఎల్లో మీడియా నేవీని సైతం వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలను ప్రసారం చేసింది. అంతేకాకుండా మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయవద్దంటూ ఏపీ ప్రభుత్వానికి నేవీ లేఖ రాసినట్లు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేసింది. ఈఎస్‌ఐ కుంభకోణం, అమరావతి భూముల అక్రమాలపై సిట్‌ విచారణ నేపథ్యంలో.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా ఎత్తుగడ వేసింది. మిలీనియం టవర్స్‌కి ఐఎన్ఎస్ కళింగ ప్రాంతం దగ్గరగా ఉన్నందునే నేవీ అడ్డు చెప్పిందంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. ఎల్లో మీడియా తప్పుడు వార్తలను తూర్పు నావికాదళం తీవ్రంగా ఖండించింది. తప్పుడు కథనాలపై కేంద్ర రక్షణశాఖ దృష్టికి తీసుకెళ్తామని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు