నకిలీ నోటు.. ఇట్టే కనిపెట్టు

1 Aug, 2019 09:15 IST|Sakshi

కొత్త కరెన్సీ రాకతో ఏ నోటు అసలో.. ఏది నకిలీనో తేల్చుకోలేకపోతున్నాం. మార్కెట్లు, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో జరిపే లావాదేవీల్లో నోటు సంగతి బయటపడకున్నా.. బ్యాంక్‌కు వెళ్లితే మాత్రం అసలో.. నకిలో ఇట్టే తేల్చేస్తున్నారు. రూ.100, 200, 500 నోట్లు నకిలీవని తేలితే కొంత వరకు సరిపెట్టుకున్నా.. రూ.2000 నోటు నకిలీదని తేలితే మాత్రం వినియోగదారుడు భారీగా నష్టపోయే పరిస్థితి. అందుకే ముందు జాగ్రత్తలతోనే నోట్లను గుర్తించాలని లేకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు అధికారులు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2016లో దొంగనోట్లను గుర్తించడంపై మార్గదర్శకాల్ని విడుదల చేసింది. 17 అంశాల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ నోటును దొంగనోటుగా పరిగణించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. రూ.2000, 500, 200, 100 నోట్లను నిశితంగా పరిశీలించి దొంగనోటు కాదని నిర్ధారించుకోవాలి. ఏమాత్రం అను
మానం వచ్చిన నోటును తిరస్కరించడం మంచిది. అచ్యుతాపురం(యలమంచిలి)చెక్‌ చేసుకోండి...   

సాక్షి, విశాఖ :  దొంగనోట్లను గుర్తించడంపై అని పోలీసుస్టేషన్‌లలో సమాచారం ఉంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా నోటు ఇచ్చిన వ్యక్తిపై ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. ఏటీఎంలో వచ్చిన నగదుపై కూడా ఫిర్యాదు చేస్తే సంబంధిత ఏటీఎం నిర్వాహకులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా వారపుసంతల్లోనే నకిలీ నోట్ల మార్పిడికి అవకాశం ఎక్కువగా ఉంది. నోటుని అటూ ఇటూ చూసి గల్లాపెట్టెలో వేసేసుకుంటారు. బ్యాంకుకు వెళ్తే ఆ నోటుచెల్లదని చెబుతారు. అప్పడు లబోదిబోమంటారు. నోటు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహిస్తే మంచింది. 
– లక్ష్మణరావు, ఎస్‌ఐ 

2000 నోటు  పరిశీలించండిలా...

ముందుభాగం
  దేవనాగరిలిపిలో రూ.2000 సంఖ్య ఉంటుంది
 లైటువెలుతురులో రూ.2000 అంకెను గమనించవచ్చు
 45 డిగ్రీల కోణంలో నోటుపై 2000 అంకెను చూడవచ్చు
 మధ్యభాగంలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది
 చిన్న అక్షరాల్లో ఆర్‌బీఐ 2000 అని ఉంటుంది
 నోటును కొంచెం వంచితే విండోడ్‌ సెక్యూరిటీ త్రెడ్‌ ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది
 భారత్, ఆర్‌బీఐ, రూ.2000 అంకె ఉంటుంది
 గవర్నర్‌సంతకం, ఆర్‌బీఐ చిహ్నం కుడివైపునకు మారుతుంది
  మహాత్మగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్‌ 2000 వాటర్‌మార్క్‌  ఉంటుంది
 పైభాగంలో ఎడమ వైపున, కిందిభాగంలో కుడివైపున గల నోటు క్రమసంఖ్య అంకెల సైజు ఎడమ నుంచి కుడికి పెరుగుతూ వస్తుంది.
  కుడివైపు కిందభాగంలో రంగుమారే ఇంకుతో రూ.2000 సంఖ్య ఉంటుంది
 కుడివైపు అశోకస్థూపం చిహ్నం ఉంటుంది. అంధుల కోసం మహాత్మాగాంధీ బొమ్మ, అశోకస్థూపం చిహ్నం బ్లీడ్‌లైన్‌లో తాకితే ఉబ్బెతుగా స్పర్శని ఇస్తాయి. 
 కుడివైపు దీర్ఘచతురస్రాకారంలో ఉబ్బెత్తుగా 2000 అని ముద్రించి ఉంటుంది
 కుడి,ఎడమ వైపున ఏడు బ్లీడ్‌లైన్లు ఉంటాయి. 

వెనకభాగం... 
  నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపు ఉంటుంది 
  నినాదంతో సహా ‘స్వచ్ఛ భారత్‌’లోగో ఉంటుంది
 మధ్యభాగంలో భాషల ప్యానల్‌ ఉంటుంది
  మంగళయాన్‌ చిత్రం కూడా... 

>
మరిన్ని వార్తలు