ఎబోలా’ పై ఎయిర్‌పోర్ట్‌లలో అప్రమత్తం

30 Oct, 2014 02:00 IST|Sakshi
ఎబోలా’ పై ఎయిర్‌పోర్ట్‌లలో అప్రమత్తం

హైదరాబాద్: పశ్చిమాఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో ప్రయూణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. భారత్‌కు చెందిన చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వస్తున్నారని, వారిద్వారా ఎబోలా వైరస్ వచ్చే అవకాశముందని పేర్కొంది. గినియా, లైబీరియా, నైజీరియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయూల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు.

ఏపీకి పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కాస్త అనుమానాస్పదంగా ఉన్న 23 మందిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా, ‘ఎబోలా’కు ఎలాంటి వైద్యం అందించాలన్నదానిపై కేంద్రం రాష్ట్రానికి చెందిన నలుగురు వైద్యులకు శిక్షణ నిచ్చినట్టు ఎబోలా వైరస్ నియంత్రణ నోడల్ అధికారి డా.లక్ష్మీ సౌజన్య తెలిపారు.
 

మరిన్ని వార్తలు