'నామినేషన్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు'

11 Mar, 2020 11:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకునే చర్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్తులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమోటోగా సంబంధించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చెయ్యడం జరిగిందన్నారు.

ఎన్నికల విధుల్లో ఆటంకాలు కలుగచేసినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించినా ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన యంత్రాంగం ఉందన్నారు. ఇప్పటిదాకా.. ఎక్కడా కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నికల సమయంలో ఇబ్బందులకు కలుగాచెయ్యడాన్ని కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు