'పించనుదారుల కోసం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలి'

3 Nov, 2013 14:54 IST|Sakshi

హైదరాబాద్: పింఛన్ దారుల సమస్యల నివృత్తికి వెంటనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని పెన్షనర్ల చర్చా వేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 10 లక్షల మంది పించనుదారులు ఉన్నట్లు ఆయన తెలిపారు.  టోల్‌ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  


 పింఛన్ దారులకు వయసు రీత్యా ఇచ్చే అదనపు పింఛన్ భాగాన్ని 75 ఏళ్ల నుంచి కాక 65 సంవత్సరాల నుంచి ప్రారంభించాలని  ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు