మే 30న ఎడ్‌సెట్ పరీక్ష

23 Apr, 2014 01:24 IST|Sakshi

ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం

హైదరాబాద్: ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్)-2014ను  మే 30వ తేదీన నిర్వహించాలని ఎడ్‌సెట్-2014 కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో మంగళవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2వ తేదీన ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తామని ముందుగా షెడ్యూలు జారీ చేసినా.. ఆ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావ దినం (అపాయింటెడ్ డే) కావడంతో పరీక్షను మూడు రోజులు ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. ఇక అభ్యర్థులు ఈనెల 24 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని, రూ. 500 ఆలస్య రుసుముతో ఈనెల 30వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

రూ. 150 పరీక్ష ఫీజును ఈసేవ/మీసేవ/ఏపీఆన్‌లైన్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు సహాయంతో ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఎడ్‌సెట్ రాసి, కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని పేర్కొన్నారు. 618 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 50,050 సీట్లు, మేనేజ్‌మెంట్ కోటాలో 16,680 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎడ్‌సెట్‌ను వచ్చే నెల 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇతర వివరాలను ఠీఠీఠీ.్చఞ్ఛఛీఛ్ఛ్టి.ౌటజ  వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.
 
ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా లాసెట్: జూన్ 8వ తేదీన లాసెట్-2014 నిర్వహణ కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఉన్నత విద్యా మందలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు

మరిన్ని వార్తలు