విద్యాభివృద్ధి దేశ స్థితి గతులనే మార్చేస్తుంది: గవర్నర్‌

1 Aug, 2019 15:20 IST|Sakshi
ఫోటో ఫైల్‌

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వ విద్యాలయం ఛాన్సలర్గా విద్యార్థులను ఉద్దేశించి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ప్రసంగించారు. విద్యాభివృద్ధి దేశ స్థితి గతులను పూర్తిగా మార్చి వేయగలదనే నమ్మకం ఉందన్నారు. ఆంధ్ర విశ్వ విద్యాయలం దేశ విద్యా వ్యవస్థకు విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అంతేకాకుండా భవిష్యత్ లో కూడా ఆంధ్ర విశ్వ విద్యాలయం ఎన్నో విద్యా కుసుమాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

చైనా రాజధాని లో కాలుష్య దుప్పటి కప్పి మూడు రోజులు విద్య సంస్థలకు సెలవు ప్రకటించారని, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాలుష్యం విపరీతంగా ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు. విశాఖలో కూడా కాలుష్యం ఎక్కువగా ఉందని, అందరూ కలిసి కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. రోజురోజుకూ నీటి కాలుష్యం, వాయు కాలుష్యం పెరుగుతోందనీ, పర్యావరణ పరిరక్షణకు అందరు పాటు పడాలన్నారు. విశ్వ విద్యాలయాలు మొక్కల పెంపకానికి నడుం కట్టాలని గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు