సమర్థపాలన జగన్‌కే సాధ్యం

1 Apr, 2014 01:02 IST|Sakshi
సమర్థపాలన జగన్‌కే సాధ్యం

చిల్లంగి (కిర్లంపూడి), న్యూస్‌లైన్ : సమర్థవంతమైన పాలన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే సాధ్యమని, ప్రజా ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని చిల్లంగి గ్రామంలో కాళ్ల దొంగబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాపేటి పెద్ద, కర్రి బాబూరావు (సింగరయ్య) తదితరులు దొంగబాబు స్వగృహంలో జ్యోతుల నెహ్రూ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
 
వీరితో పాటు కొత్త స్వామి, బుద్ద రాధాకృష్ణ, కోరుమిల్లి వీరవెంకట నాగేశ్వరరావు, దిద్ది ఆదిత్యకుమార్, కాళ్ల సతీష్, కాళ్ల శ్రీను, కాళ్ల హరికృష్ణ, భద్రాచలంతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు పార్టీలోకి చేరారు. వీరికి జ్యోతుల నెహ్రూ వైఎస్సార్ సీపీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థి వీరంరెడ్డి కాశీబాబును, ఎంపీపీ అభ్యర్థి కర్రి సూర్యనారాయణమూర్తిలను, పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
 
అలాగే మే 7న జరిగే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తనను, తనతో పాటు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను గెలిపించాలని కోరారు. పార్టీ నాయకులు ఎస్.ఎస్.రామ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి వీరంరెడ్డి కాశీబాబు, ఎంపీపీ అభ్యర్థి కర్రి సూర్యనారాయణమూర్తి, ఎంపీటీసీ అభ్యర్థులు చెప్పుల బుచ్చమ్మ, మంకిన మహాలక్ష్మి, సేనాపతి గౌరీపార్వతి, సరకణం మేరీమణితో పాటు పార్టీ నాయకులు తూము చినబాబు, కర్రి సూర్యకుమార్, మద్దాల రాంబాబు, గుడాల రాంబాబు,  గుబ్బల కుమారి, దిద్ది సుబ్బారావు, పీలా రమణ
తదితరులు పాల్గొన్నారు.
 
ప్రచార రథం ప్రారంభం
జెడ్పీటీసీ అభ్యర్థి వీరంరెడ్డి కాశీబాబు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రచార రథాన్ని చిల్లంగిలో సోమవారం రాత్రి జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు.
 
 వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
 తాళ్లరేవు : వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ైవె ఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని పార్టీ ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గుత్తుల సాయి పేర్కొన్నారు. సోమవారం పిల్లంక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీనియర్ నాయకులు సాగి భాస్కరరాజు, సాగి వెంకట కృష్ణంరాజు, గ్రామ కమిటీ కన్వీనర్ కాకర్లపూడి వెంకట కృష్ణంరాజు, మాజీ సర్పంచ్ వి.విష్ణుమూర్తి సమక్షంలో 300 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.
 
వీరికి గుత్తుల సాయి, సుదర్శనబాబు, దంతులూరి రవివర్మ తదితరులు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. సాయి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అనాలోచితంగా విభజించిందన్నారు. ప్రస్తుత పరిస్థిత్చుల్లో రాష్ట్రంలో సుస్థిర పాలన అందించే సత్తా జగన్ మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు. ఐదు సంతకాలతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచి జీవితంపై భరోసా కల్పిస్తారన్నారు.
 
సుదర్శనబాబు మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఘన విజయం అందించాలని కోరారు. పార్టీ నాయకులు భూపతిరాజు బుచ్చిరాజు, వాసంశెట్టి విష్ణుమూర్తి, కర్రి వామనమూర్తి, ఎస్‌కేఎస్ బాషా, శీలం గోపాలం, పేకేటి లక్ష్మీకాంతం, సాగి శివరామరాజు, ఆముజూరి వరప్రసాద్, కుమార్, శ్రీనురాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు