‘భోజనం’ వికటించి 80 వుందికి అస్వస్థత

6 Jul, 2014 02:41 IST|Sakshi

 పెద్దపంజాణి: చిత్తూరు జిల్లాలో శనివారం మధ్యాహ్న భోజనం వికటించి ఎనభై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పెద్దపంజాణి మండలంలోని శంకర్రాయలపేట ఉన్నత పాఠశాలలో 270మంది విద్యార్థులున్నారు. శనివారం మధ్యా హ్న భోజనం తిన్న సుమారు 80మంది విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి తీవ్రమైంది. వారిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని గుట్టూరు, పలమనేరు ప్రభుత్వాసుపత్రులకు తరలించా రు.

మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని భావిస్తున్నారు. ఇదిలాఉండగా పలమనేరు ప్రభుత్వాసుపత్రికి విద్యార్థులను తరలిస్తున్న ఆటో బోల్తా పడి ఇద్దరు విద్యార్థులుతీవ్రంగా గాయపడ్డారు. అలాగే గుంటూరు జిల్లా నాదె ండ్లలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో మధ్యాహ్న భోజనం వికటించి 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కందిపప్పు వల్లనే వీరు అస్వస్థతకు గురి అయినట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు