ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష వాయిదా

28 Mar, 2020 13:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షను కరోనా కారణంగా వాయిదా వేశామని గిరిజన గురుకులం సంస్థ సంయుక్త కార్యదర్శి ఎస్. లక్ష్మణ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న జరగాల్సింది. ఇక 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు హాజరుకావడానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ పరీక్షను వాయిదా వేసిన విషయాన్ని ఇదివరకే వ్యక్తిగతంగా తెలియజేశామని ఆయన చెప్పారు. ఈ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని అభ్యర్థులందరికీ తర్వాత తెలియజేస్తామని లక్ష్మణ్ రావు వివరించారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లితండ్రులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (‘సీఏ’ పరీక్షలు వాయిదా  )

చదవండి: ప్రవేశ పరీక్షల సందేహాలకు..ఎన్టీయే పరిష్కారం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు