ఎక్కడివారు అక్కడే..!

3 Feb, 2016 02:01 IST|Sakshi

విజయనగరం అర్బన్ :    ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం మళ్లీ వాయిదా పడింది. ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు ఈ ఏడాదీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చివరికి వాయిదా వేయించాయి. దీంతో విద్యార్థులకు తాము చదివే కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితంగా కళాశాలలో ప్రయోగశాలలు ఉన్నా, లేకు న్నా.. పరికరాలు లేకపోయినా, అసలు ప్రయోగాలు చేయకపోయినా మార్కులు మాత్రం పూర్తిస్థాయిలో పడే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి 100 కళాశాలల్లో పరీక్షా కేంద్రాల జిల్లాలో 171 కళాశాలలు ఉంన్నాయి. వీటిలో 22 ప్రభుత్వ, 5 ఎయిడెడ్ కళాశాలలు, 16 ఆదర్శ పాఠశాలలు, 10 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, మిగిలినవి ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి.

వీటిలో ప్రాక్టికల్స్ నిర్వహణకు కేవలం 70 కళాశాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో వసతులు ఉన్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు కొన్ని అద్దె గదుల్లోనే కొనసాగుతున్నాయి. పాత పద్ధతిలోనే ప్రాక్టిల్ నిర్వహించాలనే నిర్ణయంతో 100 కళాశాలలను ఎంపిక చేశారు. వాటిలో ఈ నెల 4వ తేదీ నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు రాయనున్న 14,176 మంది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్కళాశాలలోద్వితీయసంవత్సరసైన్స్విద్యార్థులు14,176మందిప్రయోగపరీక్షలకహాజరుకానున్నారు.ఎంపీసీవిద్యార్థులు5,452మంది, బైపీసీ విద్యార్థులు 4,666 మంది ఉన్నారు.ప్రైవేట్ విద్యార్థులకు సవాల్ ప్రయోగ పరీక్షలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు సవాలుగా మారనున్నాయి. అపార్టుమెంట్లలోని ఇరుకు గదుల్లో ఎక్కువగా ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తున్నారు.

ఇక్కడ థియరీ నిర్వహించేందుకే గదులు చాలడం లేదు. ఇక ప్రయోగాలు ఎక్కడ చేయిస్తారని స్వయంగా ఓ అధ్యాపకుడే విచారం వ్యక్తంచేశారు. ప్రయోగాలు చేసేందుకు అవసరమయ్యే పిప్పెట్, బ్యూరెట్, టెస్ట్ ట్యూబ్ (పరీక్ష నాళిక) పరికరాలు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మందికి తెలియవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అరకొరగా అయినా ప్రయోగశాలలు ఉన్నాయి. విజయనగరంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో కొన్నేళ్లుగా ల్యాబ్ లేదు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయితే చాలు మార్కులు వచ్చేస్తాయని ఆ విద్యా సంస్థ యాజమాన్యం విద్యార్థులకు భరోసా ఇస్తోంది. ఈ మేరకు అధికారులను ‘మేనేజ్’ చేస్తూ వస్తున్నారు. ప్రాక్టికల్స్‌లో మార్కుల పేరుతో కొన్ని యాజమన్యాలు అదనంగా ఫీజు వసూలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు