చంద్రబాబు కుట్రలకు ఈసీ చెంపపెట్టు..

7 Aug, 2017 19:01 IST|Sakshi
శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ ఆమోదం

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. టీడీపీ అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తోసిపుచ్చారు. నోటరీ రెన్యువల్‌ అంశాన్ని, స్టాంప్‌ పేపర్‌పై అదనపు అఫిడవిట్‌ ఇ‍వ్వలేదంటూ టీడీపీ మెలికపెట్టినప్పటికీ వాటిని.. ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రెండు గంటలపాటు టీడీపీ మీడియా దుష్ప్రచారానికి  ఈసీ పుల్‌స్టాప్‌ పెట్టినట్లు అయింది.  కాగా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన నేటితో ముగిసింది.

ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ...  చంద్రబాబు నాయుడు కుట్రలకు ఎన్నికల కమిషన్‌ చెంపపెట్టులా సమాధానం ఇచ్చినట్లు అయిందన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయాలని ఎల్లో బ్యాచ్‌ ఆలోచనలకు ఈసీ బ్రేక్‌ వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. నామినేషన్ల దగ్గర కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గమన్నారు. ధైర్యంగా పోరాటం చేయలేక టీడీపీ సాకులు వెతుకుతుందని అంబటి విమర్శించారు.  నంద్యాలలో గెలవడానికి వెయ్యి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్‌ కూడా ఈసీ ఆమోదించింది.

మరిన్ని వార్తలు