కృష్ణా.. మీ ఓటు తెలుసుకొండి ఇలా..

10 Mar, 2019 13:54 IST|Sakshi

సాక్షి, కృష్ణా :  నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.

  • 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 
  • www.ceoandhra.nic వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 
  • కలెక్టరేట్‌ కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి : స్వామినాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌: 9849903988
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. 
  • మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  
  • సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. 

-ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం

మరిన్ని వార్తలు