చూపుడు వేలు లేకుంటే.!

23 Mar, 2019 10:14 IST|Sakshi

పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమచేతి చూపుడువేలుకు సిరా చుక్క పెడతారు. ఓటు వేసే వ్యక్తికి ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే ఎలా,.. దీనికి ఎన్నికల సంఘం ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. ఎడమచేతికి చూపుడు వేలు లేకుంటే మధ్య వేలుకు, అదీ లేకుంటే బొటన వేలుకు సిరాచుక్క వేసే అవకాశం కల్పించింది. ఎడమ చేతికి అసలు వేళ్లు లేకుంటే కుడి చేతి చూపుడు వేలుకు అదీ లేకుంటే ఈ తర్వాత ఏది ఉంటే ఆ వేలుకు చుక్క పెడతారు. రెండు చేతులకూ వేళ్లు లేకుంటే వేళ్ల మొదళ్ల మధ్య భాగంలో లేకుంటే చేయిపై రాస్తారు.

మరిన్ని వార్తలు